- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం..
గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్సై కొటేష్ అన్నారు.

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే పోలీసుల ప్రధాన లక్ష్యమని పాలకవీడు ఎస్సై కొటేష్ అన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శనివారం పాలకవీడు మండలంలో డాగ్స్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోటళ్లు, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు, పాఠశాల ప్రాంగణాలు, సిమెంట్ ఫ్యాక్టరీ ట్రాన్స్‌పోర్ట్ అడ్డాలు, బహిరంగ ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, గంజాయి వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నా, సరఫరా చేస్తున్నా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






