మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

by Ratna Kumari |

ఇటీవల కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి మైత్రి అన్నమాటకు సరైన నిర్వచనాన్ని అందించారు.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
X

దిశ, ఆత్మకూరు(ఎం) : ఇటీవల కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి మైత్రి అన్నమాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి పూర్వ విద్యార్థి మిత్రులు ఆత్మకూరు మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన వెలిమినేటి పురుషోత్తం ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న 2008- 2009 బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. రూ. 80000/-సేకరించిన నగదును మిత్రుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నవనీత, అనూష, నరేష్, ప్రవీణ్, స్వామి, వీరస్వామి, కృష్ణ, నరేష్, రవి పాల్గొన్నారు.

Next Story