పురుగుల మందు డబ్బాతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన

by Chintha Aamani |

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం నిరసనకు దిగారు.

పురుగుల మందు డబ్బాతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన
X

దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం నిరసనకు దిగారు. ఓ బ్యాంకు ఉద్యోగి తమ భూమిని ఆక్రమిస్తున్నాడంటూ నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం మొలక చర్ల గ్రామానికి ,చెందిన దళితులు కుటుంబ సభ్యులతో కలిసి పురుగు మందుల డబ్బాలు, పెట్రోల్ బాటిల్ తో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 158,153 లోని ప్రభుత్వ భూమిలో ఏళ్ల తరబడి తాము కబ్జాలో ఉన్నామని,ఆ భూమిపై గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పట్టాలు కూడా తమకు వచ్చాయన్నారు.

కాగా తమ పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసిన బ్యాంకు ఉద్యోగి రామకోటి తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ, రాత్రి వేళల్లో యంత్రాల సాయంతో పొలం సరిహద్దులు చెరిపేస్తూ కబ్జా చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అడవిదేవులపల్లి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినప్పటికీ కబ్జాదారునికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసి రామకోటికి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story