ధర్మారెడ్డి పెళ్లి కాలువ పూర్తి చేసి, సాగునీరు అందించాలి

by velandi.Saikiran |

ధర్మారెడ్డి పెళ్లి కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించాలని

ధర్మారెడ్డి పెళ్లి కాలువ పూర్తి చేసి, సాగునీరు అందించాలి
X

దిశ, రామన్నపేట : ధర్మారెడ్డి పెళ్లి కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించాలని ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, బిజెపి మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ వినీత భాయ్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మండలంలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పూర్తి చేయాలని కోరారు.

ధర్మారెడ్డి పల్లి, పిలాయిపల్లి, కాలువలకు భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదని బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రామన్నపేట పట్టణం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలు ఏర్పడడంతో, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రహదారులకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలని, సుభాష్ సెంటర్ నుంచి బీసీ కాలనీ వరకు డబుల్ రోడ్డుకు నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తాటిపాముల శివకృష్ణ, వనం అంజయ్య, కంభంపాటి శివరంజన్, బట్టి రమేష్, గజ్జల రాము, సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, బాత్క నరేష్, రేపాక లింగస్వామి, బందెల సంజీవ, గన్నెబోయిన మధు తదితరులు పాల్గొన్నారు.

Next Story