- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల్లో భాగమైన యూత్ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు చేయాలని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అమలు చేయాలని, నిరుద్యోగ భృతి రూ.4వేలు తక్షణమే అందించాలని, నిరుద్యోగులకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అయితగోని విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, మునుగోడు : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల్లో భాగమైన యూత్ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు చేయాలని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అమలు చేయాలని, నిరుద్యోగ భృతి రూ.4వేలు తక్షణమే అందించాలని, నిరుద్యోగులకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అయితగోని విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, భగత్ సింగ్, సామ్రాట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడోత్సవాల బహుమతుల ప్రధానోత్సవ సభ డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కట్ట ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక హామీల నెరవేర్చడంలో విఫలం అయిందని తెలిపారు. ముఖ్యంగా యువతకు నిరుద్యోగ భృతి లాంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు. గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల పేరుతోటి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి క్రీడా మైదానాలను చేసిందని, ఈ ప్రభుత్వం క్రీడా మైదానాలను పట్టించుకోకుండా గ్రామస్థాయి క్రీడాకారులకు ఇలాంటి క్రీడా వస్తువులు అందులో బాటలో లేకుండా గ్రామీణ క్రీడాకారులకు క్రీడలను దూరం చేసేటటువంటి నిర్లక్ష్యమైన ధోరణి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.
లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా..
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించి గ్రామాల్లోని యువతను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి క్రీడల వైపుకు యువతను వెళ్లే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో యువత డ్రగ్స్, గంజాయి, మద్యం అనేక ఆసాంఘిక కార్యక్రమాల వైపు వెళుతున్నారని అలా వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం యువతను క్రీడల వైపు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని కోరారు. మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, రాజ్యాంగం మీద విషం చిమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు, లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా యువకులు పెద్ద ఎత్తున పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో కొన్ని ప్రధానమైన సమస్యల పైన డివైఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుందని. డివైఎఫ్ఐ చేసే పోరాటాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని కోరారు. యువజన సమస్యల మీదనే కాకుండా ప్రజా సమస్యల మీద కూడా డివైఎఫ్ఐ పనిచేస్తుందని తెలిపారు.
మేక కృష్ణారెడ్డి జ్ఞాపకార్ధంగా..
మేక కృష్ణారెడ్డి జ్ఞాపకార్ధంగా వారి కుటుంబసభ్యుల సహకారంతో సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా కమిటీ కళాకారులచే సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని గుర్తుచేసే వీర తెలంగాణ వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, సీఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, పగిళ్ల మధు, డీవైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు కట్ట వెంకన్న, వనం సంపత్, కుక్కల బాలస్వామి, సింగపంగా నరేష్, కుక్కల మహేష్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాంపల్లి చంద్రమౌళి, కుమ్మరి శంకర్, పిఎన్ఎమ్ డివిజన్ కార్యదర్శి చికూరి బిక్షం, బొందు ముత్యాలు, చేకూరి ప్రేమ్ సాగర్, బొందు శివ, జిల్లపల్లి శివ, గోస్కొండ శ్రీకాంత్, భయ్యా సురేష్, చేకూరి అరుణ్ సాగర్, కుక్కల కార్తీక్, నారగోని పవన్, వరికుప్పల వినయ్, పగిళ్ల సాయి తేజ, సింగపంగా మధుకర్, సింగపంగా దినేష్, ప్రదీప్, శ్రీకాంత్, శిరస్సు నవీన్, బొందు అనిల్ పాల్గొన్నారు.






