- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా... వ్యాపారమా..? ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడి..
విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. చదువుకునే రోజులు పోయి, చదువు కొనుక్కొనే రోజులు వచ్చాయి.

దిశ, నకిరేకల్ టౌన్ : విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. చదువుకునే రోజులు పోయి, చదువు కొనుక్కొనే రోజులు వచ్చాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పేదవాడి శ్రమ దోపిడీగా మారింది. ఈ పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసిన తపన, ప్రైవేట్ విద్యాసంస్థలకి లాభ మార్గంగా మారింది. చదువు పేరుతో డబ్బుల దోపిడీకి తెరలేపారు.
బ్రోచర్ల భ్రమ... కనీస వసతుల కరువు
పల్లె పల్లెల్లోకి వెళ్లి అడ్మిషన్ల పేరుతో ఫోన్లు చేస్తూ, టాలెంట్, టెక్నో, కాన్సెప్ట్, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్, కిడ్స్ వంటి పేర్లతో మల్టీకలర్ బ్రోచర్లతో ఆకట్టుకుంటున్నారు. కానీ, విద్యాసంస్థల స్థితిగతులు మాత్రం నామమాత్రం. చదువు బోధనకే గదులుండవు. ఇరుకైన గదుల్లో 40 నుంచి 60 మంది విద్యార్థులను కుక్కుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ భవనాల్లో గదులు ఉండటంతో రీసౌండ్ ఏర్పడి, బోధన విద్యార్థులకు అర్థంకాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పుస్తకాలు, నోట్ బుక్స్ పై 'ఊబరితనం'
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆ పాఠశాల నుంచే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ కొనాల్సిందేనని పాఠశాల యాజమాన్యం గట్టి నిబంధనలు విధిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో పుస్తకాల విక్రయం నిషేధం. అయినప్పటికీ కొందరు టీచర్లు, పార్ట్‌నర్ల ద్వారా అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫీజుల మోత.. పేర్లు మారినా దోపిడీ ఒకటే
అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, వ్యాన్ ఫీజు, యూనిఫామ్, షూ, ఐడీ కార్డ్, ల్యాబ్, లైబ్రరీ పేర్లతో వేర్వేరు తలంపులతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నర్సరీ నుంచి పదవ తరగతి వరకు తల్లిదండ్రులు రూ.20,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. పాఠశాలలు తమదైన రీతిలో ఫీజులు నిర్ణయించుకుంటున్నాయి. విద్య హక్కు చట్ట ప్రకారం 25 శాతం స్థానాలను ఉచితంగా కేటాయించాల్సిన నిబంధనను ఎక్కడా పాటించడం లేదు.
వసతులు లేని తరగతుల గదులు
ఇది విద్యా హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధం. తరగతి గదులు విశాలంగా ఉండాలి. ల్యాబ్, లైబ్రరీ, ఆటస్థలం, ఫైర్ సేఫ్టీ, మంచినీటి సదుపాయం ఉండాలి. కానీ అనేక పాఠశాలలు అద్దె భవనాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి.
విద్యాశాఖ ‘పర్యవేక్షణ’ ఎక్కడ?
నకిరేకల్ పట్టణంతో పాటు, కట్టంగూర్, శాలిగౌరారం, కేతపల్లి మండలాల నుంచి విద్యార్థులు స్కూల్ వ్యాన్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివస్తున్నారు. వీరంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్య అందిస్తున్న ఈ సమయంలో, ప్రైవేట్ విద్యాసంస్థలు మోసపూరితంగా వ్యవహరిస్తుండటం ఆందోళనకరం. విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకుని ఉండటంతో ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.






