- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నారం గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
నేం చేసినా చెల్లుతుందంటూ ప్రవర్తిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని.. తన పని తాను చేసుకుంటూ పోతుందని తుంగతుర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు అసాంఘిక శక్తులను హెచ్చరించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఆదివారం తన సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

దిశ, తుంగతుర్తి: నేనేం చేసినా చెల్లుతుందంటూ ప్రవర్తిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని.. తన పని తాను చేసుకుంటూ పోతుందని తుంగతుర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు అసాంఘిక శక్తులను హెచ్చరించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఆదివారం తన సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి సీఐ నరసింహారావు మాట్లూడుతూ.. పోలీస్ శాఖ ఏ ఒక్కరికో సొంతం అనుకుంటే పొరపాటేనని, యావత్ ప్రజానీక శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు ముందుంటున్నారని అన్నారు. ఇది ఇలా ఉంటే పోలీసులు నిత్యం ప్రజల వెన్నంటి ఉంటారనే నమ్మకాన్ని కలిగించడమే ఫ్లాగ్ మార్చ్ లక్ష్యమని పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఎన్నికల నియమాల లోబడి నడుచుకోవాలని అన్నారు. సమస్యలు సృష్టించే వారిని గుర్తిస్తూ ముందస్తుగా ఆయా మండలాల తహశీల్దార్ ల ముందు బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల ఎస్సైలు క్రాంతికుమార్, వీరన్న, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.






