- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కానిస్టేబుల్.. మైనర్‌తో మూడో పెళ్లి.. పోక్సో కేసు నమోదు
సూర్యాపేట జిల్లాలో నిత్య పెళ్లికొడుకుగా మారిన కానిస్టేబుల్ కృష్ణంరాజుపై పోక్సో కేసు నమోదైంది. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న అతను..

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడమో, న్యాయం చేయడమో చేయాల్సిన పోలీసులే సమస్యాత్మకంగా మారుతున్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అడ్డుకోవాల్సింది పోయి.. వయసు మరచి వారి జీవితాలను కబళిస్తున్నారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కానిస్టేబుల్.. మూడో పెళ్లి మైనర్‌ను చేసుకున్నట్లు తేలడంతో అతనిపై తాజాగా పోక్సో కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన కృష్ణంరాజు బాగోతమిది. ఏడాది క్రితం సూర్యాపేట మండలానికి చెందిన 10వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లాడినట్లు ఇటీవల తెలియడంతో జిల్లా ఎస్పీ నరసింహ సీరియస్ అయ్యారు. వారంరోజుల క్రితమే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.
తాజాగా ఆ బాలిక వయసు 13 సంవత్సరాలని తెలియడంతో.. బాలిక తల్లి నుంచి ఫిర్యాదు తీసుకుని పోక్సో చట్టం కింద కృష్ణంరాజుపై కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు గతంలో ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నడిగూడెం పీఎస్‌లో విధులు నిర్వహిస్తూ.. బాలికను వివాహం చేసుకుని సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న అతడిని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్సై బాలునాయక్ తెలిపారు.






