- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగాలు ఇవ్వలేక విద్యార్థులతో చెలగాటమా..?
పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీల ద్వారా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

దిశ, తుంగతుర్తి: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చివరికి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీల ద్వారా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం ఆయన తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.వివిధ రకాలుగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు రోజురోజుకు అంధకారంగా మారుతోందని పేర్కొంటూ ఇప్పటికే పలువురు విద్యార్థులు జీవితంపై విరక్తితో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్...
ముఖ్యంగా నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ విద్యార్థుల జీవితాలను అంధకారం చేసిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థుల గొంతుకగా మారి వారి పక్షాన పోరాటం చేస్తున్నారని వివరించారు.దీనికి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకనైనా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికడుతూ అర్హులైన విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులంతా ధైర్యంగా ముందుకు సాగాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని నరసయ్య విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి గోవర్ధన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహార్, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు రామడుగు నవీన్, సర్పంచులు కోరుకొప్పుల నరేష్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, పెదబోయిన అజయ్, ఉప్పుల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.






