- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్తగారింటికి వెళ్లే మార్గమధ్యలో ఘోర ప్రమాదం.. అల్లుడు మృతి
నల్గొండ జిల్లాలోని నేరేడుచర్లలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మోటార్‌సైకిల్‌పై తన అత్తగారింటికి వెళ్తున్న శివ అనే వ్యక్తిని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దిశ, నేరేడుచర్ల : నల్గొండ జిల్లాలోని నేరేడుచర్లలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మోటార్‌సైకిల్‌పై తన అత్తగారింటికి వెళ్తున్న శివ అనే వ్యక్తిని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం, దామరచర్లకు చెందిన వెలిదండి శివ (వయసు 45) బుధవారం ఉదయం తన అత్తగారింటి గ్రామమైన సర్వారం వెళ్తుండగా నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్ వైపు నుంచి మిర్యాలగూడకు వెళ్తున్న లారీ అతని మోటార్‌సైకిల్‌ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
ప్రమాదంలో శివ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ డ్రైవర్ హేమకుమార్ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. శివ భార్య రాజ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని నేరేడుచర్ల ఎస్సై రవీందర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్టు తెలిపారు.






