monkeys : కోతుల బెడదతో బెంబేలెత్తుతున్న జనం..

by Sumithra |
monkeys : కోతుల బెడదతో బెంబేలెత్తుతున్న జనం..
X

దిశ, నాగారం : మండలంలోని అన్ని గ్రామాల్లో కోతులు విపరీతమై గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి. రైతులు జనాలు కూలీలు రోజువారీ పనుల్లోకి వెళ్లాలంటే భయం భయంగా వెళుతున్నారు. కోతులు పిల్లలపై, పెద్దల పై, వృద్ధుల పై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. వీటి గాయాలకు గురైన ప్రజలు మూడు రోజులకు ఒకసారి టీకాలు తీసుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ భుజాల నొప్పులతో వాపులతో బాధపడుతున్నారు.

గ్రామాల్లో సాధారణ ప్రజలు కిరాణా సామాన్లు ఉప్పు, పప్పు కొనుక్కోవడానికి వెళ్లాలన్న కూడా భయపడుతూ వెళ్తున్నారు. అంతేకాకుండా పంటలను విద్వంసం చేస్తుండడం వలన వేరుశెనగ, పెసలు, కందులు మొక్కజొన్న, జొన్న, బొబ్బర్లు పంటలను రైతులు వేయడం లేదని, అందువలన రైతులు చాలా నష్టపోతున్నారని, వరి పంట మొక్కలను పొట్టలను కొరికి వేస్తున్నాయి . పంటలను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్న రైతుల పైన కోతులు దాడులు చేస్తున్నాయి. చివరికి ఇండ్లల్లో చొరబడి అన్నం కూరలు తింటున్నాయని అడ్డు బోయిన ఇంటి యజమానుల మీద దాడులు చేస్తున్నాయని, కోతుల విద్వంసం దాడుల నుంచి పంటలను, ప్రజలను, కాపాడాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed