- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇప్పించాలి
ప్రభుత్వ ఆసుపత్రులలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇప్పించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోరారు.

దిశ, మునుగోడు : ప్రభుత్వ ఆసుపత్రులలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇప్పించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఔట్సోర్సింగ్ 104 ఉద్యోగులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. 9 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబం గడవక అప్పులపాలవుతున్నామని, మరికొందరు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్డిహెచ్ఎస్ 104 ఉద్యోగులుగా 18 సంవత్సరాలుగా పనిచేస్తూ.. ప్రజలకు వైద్య, ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పెండింగ్ లో ఉన్న తమ వేతనాలు విడుదల చేయించాలని వారు కోరారు. స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి, వేతనాలు విడుదల అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో 104 ఎఫ్డిహెచ్ఎస్ ఫార్మసిస్ట్ లు యాదగిరి, శ్రవణ్ కుమార్, సురేష్ కుమార్, అశోక్ కుమార్ ఉన్నారు.






