హత్య కేసులో ఇద్దరు పై పీడీ యాక్ట్.. చంచలగూడ జైలుకు తరలింపు

by Bhanu |

మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో గత మార్చి 17న మిర్యాల మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత మెంచు చక్రయ హత్య కేసులో ఏ-1, 2 నిందితులుగా ఉన్న కనకటి వెంకన్న, శ్రావణ్ కుమార్ లపై సోమవారం పీడీ యాక్ట్ నమోదు చేసి చంచలగూడ జైలుకు తరలించినట్లు సీఐ నరసింహారావు తెలిపారు.

హత్య కేసులో ఇద్దరు పై పీడీ యాక్ట్.. చంచలగూడ జైలుకు తరలింపు
X

దిశ, నూతనకల్ : మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో గత మార్చి 17న మిర్యాల మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత మెంచు చక్రయ హత్య కేసులో ఏ-1, 2 నిందితులుగా ఉన్న కనకటి వెంకన్న, శ్రావణ్ కుమార్ లపై సోమవారం పీడీ యాక్ట్ నమోదు చేసి చంచలగూడ జైలుకు తరలించినట్లు సీఐ నరసింహారావు తెలిపారు. గతంలో కనకటి వెంకన్న పై 11, శ్రావణ్ కుమార్ పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని, మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో సూర్యపేట లోని సబ్ జైల్లో ఉన్న ఇరువురిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించామని అన్నారు. ప్రజల శాంతిభద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Next Story