రోగుల‌కు మెరుగైన వైద్యం అందించాలి : DH

by Ratna Kumari |

రోగుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని డీహెచ్ ర‌వీంద్ర నాయ‌క్ పేర్కొన్నారు.

రోగుల‌కు మెరుగైన వైద్యం అందించాలి : DH
X

దిశ, కనగల్: రోగుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని డీహెచ్ ర‌వీంద్ర నాయ‌క్ పేర్కొన్నారు. కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డీహెచ్ (ప్రజారోగ్య డైరెక్టర్) రవీంద్ర నాయక్ గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల ఓపి, మందుల స్టాక్, వైద్య సేవలు, సిబ్బంది పని తీరు, వ్యాధి నిరోధక టీకాలు నిలువచేసే ఫ్రీజర్స్, వ్యాక్సిన్ నిల్వ పద్ధతులను క్షుణంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మందుల రికార్డులను పరిశీలించారు. వ్యాక్సిన్ పాడవకుండా చూసుకోవాలని, సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఫార్మసిస్ట్ కి, వైద్యాధికారి గాదరి రామకృష్ణకు సూచించారు. గర్భిణుల వివరాలు, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో డెలివరీలు చేయడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓలు వేణుగోపాల్ రెడ్డి, రాహుల్, దీప, ప్రోగ్రాం ఆఫీసర్లు కళ్యాణ్ చక్రవర్తి, కొమ్మగోని నగేష్ గౌడ్, పద్మ, కృష్ణకుమారి, వైద్యాధికారి డాక్టర్ గాదరి రామకృష్ణ ఉన్నారు.

Next Story