తొలి పీహెచ్‌డీ పరిశోధకుడుగా పద్మభూషణాచారి

by Nallavelli.Anjaneyulu |

చింతలపాలెం మండలం నుంచి ఫార్మసీ విభాగంలో పీహెచ్‌డీ సాధించిన తొలి పరిశోధకుడిగా వేములూరి పద్మభూషణాచారి గుర్తింపు పొందారు.

తొలి పీహెచ్‌డీ పరిశోధకుడుగా పద్మభూషణాచారి
X

దిశ, చింతలపాలెం : చింతలపాలెం మండలం నుంచి ఫార్మసీ విభాగంలో పీహెచ్‌డీ సాధించిన తొలి పరిశోధకుడిగా వేములూరి పద్మభూషణాచారి గుర్తింపు పొందారు. అనురాగ్ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ నుంచి ఆయన డాక్టరేట్ పట్టాను విజయవంతంగా పూర్తి చేశారు.స్టేబిలిటీ ఇండికేటింగ్ మెథడ్ డెవలప్‌మెంట్ అండ్ వాలిడేషన్ ఫర్ సెలెక్టెడ్ డ్రగ్స్ బై లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే అంశంపై నాలుగు సంవత్సరాల పాటు పరిశోధన చేసి, 2025 డిసెంబర్ 30న పీహెచ్‌డీ డిగ్రీను పొందారు. ఈ పరిశోధనను డాక్ట‌ర్ శిరీష మార్గదర్శకత్వంలో పూర్తి చేయగా.. ఆమె అందించిన సహకారం, ప్రోత్సాహానికి పద్మభూషణాచారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయన అనురాగ్ ఫార్మసీ కాలేజ్, కోదాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి వేములూరి రంగాచారి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్‌గా, పీఏసీఎస్ చింతలపాలెం చైర్మన్‌గా ఉన్నారు. స్వస్థలం చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామం. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, వారి ఆశీర్వాదాలే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు.

Next Story