- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, నూతనకల్ : "అమ్మానాన్న మాకు దిక్కేవరు?" అనే శీర్షికతో ఈ నెల 7న దిశ పత్రికలో ప్రచురితమైన కథనం మానవతను తాకింది. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన ముగ్గురు పసిపిల్లల పరిస్థితి పాఠకులను కలచివేసింది. ఈ కథనం వెలుగులోకి వచ్చాక పలువురు దాతలు ముందుకొస్తున్నారు.
చిల్పకుంట్ల గ్రామానికి చెందిన పంతం పరశురాములు, సుభద్రలు ఇటీవల అకాలమరణం చెందగా, వారి ముగ్గురు పిల్లలు నవీన్ (15), శ్రావణి (13), మహేష్ (8) అనాథలుగా మిగిలిపోయారు. వారి పరిస్థితిని చూసిన చార్లెస్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ, పిల్లల చదువు బాధ్యతను తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సిడబ్ల్యు, సిఐసిడిఎస్ కమిటీల అనుమతి లభిస్తే ఈ ముగ్గురు పిల్లలను తమ ఆశ్రమంలో చేర్చి ఉచితంగా చదివించేందుకు తాము ముందుకు వస్తామని హామీ ఇచ్చారు.
అదే సందర్భంలో వారికి నెలరోజులకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం ప్రభాకర్, బోనగిరి లింగయ్య, నకరికంటి సైమన్, సామెల్, సర్వమ్మ, యాకయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల ఆగమనం లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు కానీ, దాతల ప్రేమ, ఆదరణ చిన్నారులకు కొత్త ఆశ ఇచ్చినట్టు మారింది.






