పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు : మురళి నాయక్

by Bhanu |

పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు : మురళి నాయక్
X

దిశ, పెన్ పహాడ్ : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికే, పార్టీని బలోపేతం చేయడానికి కృషి వారికి పార్టీ పదవులు వస్తాయని మహబూబాబాద్ శాసనసభ్యులు సూర్యాపేట నియోజకవర్గ పిసిసి పరిశీలకులు మురళి నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న ఆధ్వర్యంలో సంస్థగత నిర్మాణం సన్నహాక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ ఎమ్మెల్యే పిసిసి పరిశీలకులు మురళి నాయక్ మరో పరిశీలకులు శత్రు రావు, ఏఐసీసీ కమిటీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూముల సురేష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటిందని అయినా కాంగ్రెస్ కార్యకర్తలలో ఆవేదన ఉన్నదని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లో కూడా నిరుపేద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఏఐ సి సి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ మొదటినుండి పార్టీ జెండా మోసిన వారికి మాత్రమే పార్టీ పదవులు వస్తాయని, ఆసక్తి, అర్హత ఉన్నవారు పార్టీ పదవుల కొరకు అప్లికేషన్ పెట్టుకోవాలని దానికన్నా ముందు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుని ఈ పదవికి నేను అర్హుడినా, కాదా అని ఆలోచించుకోవాలని గ్రామ మండల స్థాయిలో ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం కలిగి ఉండాలని అన్నారు.

నామినేటెడ్ పోస్టులలో కూడా మాకు అవకాశం కల్పించాలని పిసిసి పరిశీలకులను కోరారు. అనంతరం ముఖ్య అతిథి మురళి నాయక్ మాట్లాడుతూ టిపిసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుందని, ఆమె ఆదేశాల మేరకు పిసిసి పరిశీలకులుగా మేము ఇక్కడికి వచ్చామని 2017 కు ముందు నుండి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అదేవిధంగా శాసనసభ పార్లమెంటు ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు లభిస్తాయని తెలిపారు సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి బ్లాక్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం కొరకే నూతన కమిటీల ఏర్పాటు అని అన్నారు. పార్టీ పదవుల కోసం అప్లికేషన్ చేసుకోవాలని ఒక్కొక్క పదవికి ఒక్క అప్లికేషన్ ఫామ్ మాత్రమే నింపాలని అన్నారు. నామినేటెడ్ పదవులు గురించి మీనాక్షి నటరాజన్ వద్ద కూలంకషంగా వివరిస్తానని హామీ ఇచ్చారు.

పార్టీ పదవుల నియామకం పారదర్శకంగా జరగాలని ఉద్దేశంతో ప్రతి మండలం నుంచి మండల అధ్యక్ష గ్రామ శాఖ అధ్యక్ష బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల ఆశించే ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకుంటామని అందులో అర్హులైన వారిని ఎంపిక చేసి అధిష్టానానికి పంపడం జరుగుతుందని అర్హతల ఆధారంగా అధిష్టానం మండల గ్రామ శాఖ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపిక చేస్తుందని పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు పార్టీ పదవులు పొందిన వారు అందరిని కలుపుకొని పోయి పార్టీ శ్రేష్టత కోసం కృషి చేయాలన్నారు. అనంతరం పలు అధ్యక్ష పదవులకు పోటీపడే ఆశావాహులు దరఖాస్తులను సురేష్ రావు వద్ద తీసుకొని దరఖాస్తులను పూర్తి చేసి నేడు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అర్తి కేశవులు, మాజీ జెడ్పిటిసి పిన్నమనేని కోటేశ్వరరావు, సంకరమద్ది సుధీర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్య శివనాయక్, నాయకులు ఒగ్గు రవి, పేరూరి వెంకటేష్, కొములయ్య, కత్తి రవీందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story