- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు
రాజాపేట మండలం రఘునాథపురం రెవెన్యూ పరిధిలోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు తహశీల్దార్ వల్లపు ప్రదీప్ తెలిపారు.

దిశ, రాజాపేట : రాజాపేట మండలం రఘునాథపురం రెవెన్యూ పరిధిలోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు తహశీల్దార్ వల్లపు ప్రదీప్ తెలిపారు. గురువారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు తహశీల్దార్ తో పాటు ఆర్ఐ పల్లెపాటి నరసింహులు, జీపీఓ చింతల గణేష్ బృందం సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండడంతో ఆరు ట్రాక్టర్లను పోలీసుల సహకారంతో పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇటీవల 14 ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని 5000 రూపాయలు చొప్పున జరిమానా విధించినప్పటికీ మార్పు రావడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులపై, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి భారీ జరిమానా విధించాలని, మరోసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేలా లిఖితపూర్వకంగా హామీ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






