- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ఎస్పీ ఊర చెరువు కాలువ కబ్జా..!
కొందరి స్వలాభం కోసం ఉన్న ఎన్ఎస్పీ పంట కాల్వను పూడ్చి వేయడంతో ఆ కాలవ ద్వారా నీరు వెళ్లి గతంలో పండిన పంట భూములన్నీ ఇప్పుడు బీడు భూములుగా మారే పరిస్థితి వచ్చింది
ఎన్ఎస్పి ఊర చెరువు కాలువ కబ్జా..!
ఈ కాల్వ ద్వారా వందల ఎకరాలకు వెళ్ళేది..
మంత్రి ఉత్తమ్ పంట కాలువలు తీవిస్తుంటే.. మరో పక్కన పూడుస్తున్నారు.
ఎన్ఎస్పి ఇరిగేషన్ అధికారులు కల్పించడం లేదా.!?
దిశ హుజూర్ నగర్ / మఠంపల్లి : కొందరి స్వలాభం కోసం ఉన్న ఎన్ఎస్పీ పంట కాల్వను పూడ్చి వేయడంతో ఆ కాలవ ద్వారా నీరు వెళ్లి గతంలో పండిన పంట భూములన్నీ ఇప్పుడు బీడు భూములుగా మారే పరిస్థితి వచ్చింది. అయినా సంబంధించిన ఎన్ఎస్పి ఇరిగేషన్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంతో రైతులు కూడా ఈ సమస్యను వారికి చెప్పుకోవాలో అర్థం కాక ఉన్న భూములను కూడా కొందరు బోర్లు వేసి విద్యుత్ మోటార్ల మోటార్ల ద్వారా వ్యవసాయ పంటలను సాగు చేస్తున్నారు. మరికొందరు ఆర్థిక స్తోమత లేక బోర్లు వేయలేక తమ భూములను బీడులుగానే ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మఠంపల్లి మండలంలో జరిగింది. ఈ కాలవను పూడ్చివేత వెనక అధికార పార్టీ నాయకుని హస్తముందని విమర్శలు వస్తున్నాయి.
ఈ కాల్వ ద్వారా వందల ఎకరాలకు వెళ్ళేది..
మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న చౌటపల్లి చెరువు నుంచి వెళ్లే ఊర కాల్వను పూడ్చివేయడంతో రైతుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. ఒకప్పుడు ఈ కాలువ ద్వారా చెరువు నీరు మఠంపల్లి చివరి వరకూ ప్రవహిస్తూ వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించేది.అయితే ఇటీవల కొందరు వ్యక్తులు స్వలాభం కోసం కాలువను పూడ్చివేశారు. గతంలో కాల్వ ద్వారా నీటితో రైతు పంట పొలాలకు ఎలాంటి నీటి కొరత లేకుండా పంటలు పండించుకునేవారు.కానీ ఇప్పుడు పూడ్చివేయడంతో చివరి ప్రాంతాల రైతులకు నీరు అందకుండా పోతుంది. దీంతో పంటలు ఎండిపోయి భూములు బీడుగా మారుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఉత్తమ్ పంట కాలువలు తీయిస్తుంటే.. మరో పక్కన పూడుస్తున్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో రైతులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి బీడు భూములకు కూడా నీరందించి సాగు భూమిగా మార్చాలని కృష్ణా నది మూసీ నదిపై లిఫ్ట్ ఏర్పాటు చేయించి భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి మరి కాలవలు తవ్విస్తున్నారు. మరి రైతుల పంట పొలాలకు నీరందిస్తుంటే కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతో ఉన్న పంటకాలను పూడ్చి వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఎన్ఎస్పి ఇరిగేషన్ అధికారులు కనిపించడం లేదా.!?
పంటకాలను పూడ్చివేసి ఆభూమి స్వాధీనం చేసుకొని దాని పక్కన వే బ్రిడ్జి పెట్టిన ఇరిగేషన్ ఎన్ ఎస్ పి అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇంత పెద్ద కాలవను పూడ్చివేసిన అధికారులు కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సంబంధించిన అధికారులు వెంటనే పట్టించుకోని ఆ కాలంలో మళ్ళీ పంట కాలువ మార్చాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించాలని రైతులు కోరుకుంటున్నారు.






