- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలి: కలెక్టర్ ఇలా త్రిపాటి
త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం దామరచర్ల మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలను సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి తనిఖీ చేశారు.

దిశ, మిర్యాలగూడ: త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం దామరచర్ల మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలను సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి తనిఖీ చేశారు. దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ నామినేషన్ వేసేందుకు చేసిన ఏర్పాట్లను, హెల్ప్ డెస్క్ ను, ఎన్నికల నోటిఫికేషన్ ప్రచురించింది లేనిది పరిశీలించారు.
అలాగే గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలను ఎంపీడీవో ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆ క్లస్టర్ లో ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్ల వివరాలను, నామినేషన్ పత్రాలు, నామినేషన్ వేసేందుకు వచ్చే వారికి హెల్ప్ డెస్క్ ద్వారా అందిస్తున్న సమాచారం, నామినేషన్ వేసేటప్పుడు సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, ఇతర అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్, తదితర అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
వచ్చిన నామినేషన్లనింటిని ఎప్పటికప్పుడు స్కాన్ చేయడం, రిజిస్టర్లో నమోదు చేయడం, నామినేషన్ వివరాలను సకాలంలో డి పి ఓ కార్యాలయానికి పంపించడం, టి పోల్ లో అప్లోడ్ చేయడం లాంటివి జాప్యం లేకుండా చేయాలని.. ఈ సందర్భంగా ఆమె ఇబ్బందిని ఆదేశించారు. నామినేషన్ స్వీకరించే గదిలో డిజిటల్ క్లాక్, 100 మీటర్ల పరిధిలో బందోబస్తు, ఓటరు జాబితా ప్రచురణ తదితర అంశాలను ఆమె పరిశీలించారు.






