- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి : ఎస్సై సైదులు
దిశ, శాలిగౌరారం : ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సైదులు హెచ్చరించారు.

దిశ, శాలిగౌరారం : ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సైదులు హెచ్చరించారు. మంగళవారం విలేకరులతో ఎస్ఐ మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా ప్రతి వాహనాదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలనీ సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించొద్దని,ఫామ్ హౌస్,క్లబ్ లాంటి వాటిల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించొద్దని సూచించారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా సౌండ్ సిస్టమ్ (డీజే) ఏర్పాటు చేయొద్దన్నారు. త్రిబుల్ రైడింగ్ తో వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే మైనర్ పై,వాహన యాజమానిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం ,వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయొద్దని, నూతన సంవత్సర వేడుకల పేరుతో మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని యువతకు ఎస్ఐ సూచించారు.






