నూత‌న సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావ‌ర‌ణంలో జరుపుకోవాలి : సీఐ వెంకటేశ్వర్లు

by Ratna Kumari |

దిశ,రామన్నపేట : నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామన్నపేట సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ ఎన్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

నూత‌న సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావ‌ర‌ణంలో జరుపుకోవాలి : సీఐ వెంకటేశ్వర్లు
X

దిశ, రామన్నపేట : నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామన్నపేట సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ ఎన్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో విలేకర్ల‌ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. డిసెంబర్ 31 రాత్రి ప్రధాన రహదారులపై వేడుకలు నిషేధించబడ్డాయని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. మితిమీరిన‌ వేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులను క్షోభకు గురిచేయవద్దన్నారు. మద్యం దుకాణదారులు నిర్ణీత సమయం వరకే విక్రయాలు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. అర్ధరాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యార్థులు, యువతకు ఆయ‌న సూచించారు.

Next Story