- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవ వధువు ఆత్మహత్య.. పెళ్లి అయిన 5 రోజులకే ఎందుకు..?
పెళ్లి అయినా యువతి పెళ్లయిన ఐదు రోజులకే తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది.

X
దిశ హుజూర్ నగర్ : పెళ్లి అయినా యువతి పెళ్లయిన ఐదు రోజులకే తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. హుజూర్ నగర్ ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన షేక్ ఖసీంబీ తన కుమార్తె షేక్ మహబూబి ,@ హసీనా (19) గత నెల ఏప్రిల్ 30న చింతలపాలెం గ్రామానికి చెందిన షేక్ యూసఫ్ కు ఇచ్చి వివాహం చేశాడని చెప్పారు. ఈనెల 3 శనివారం తన భర్త షేక్ యూసఫ్ తో కలిసి పుట్టింటికి వచ్చిందని తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలు బాత్ రూంలో స్నానానికి వెళ్లి ఇనుప కడ్డీకి ఉరి వేసుకుని చనిపోయిందని తెలిపారు. తల్లి ఖాసీంబీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






