తైక్వాండో ఇంటర్నేషనల్ లో గోల్డ్ సాధించిన తెలుగు తేజం గమన్ రెడ్డి

by Bhanu |

తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో నిర్వహించిన మొదటి ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ 2025 అండర్ 22 కిలోల విభాగంలో నేరేడుచర్లకు చెందిన కొణతం గమన్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించాడని గమన్ రెడ్డి తాతయ్య నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు.

తైక్వాండో ఇంటర్నేషనల్ లో గోల్డ్ సాధించిన తెలుగు తేజం గమన్ రెడ్డి
X

దిశ, నేరేడుచర్ల : తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో నిర్వహించిన మొదటి ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ 2025 అండర్ 22 కిలోల విభాగంలో నేరేడుచర్లకు చెందిన కొణతం గమన్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించాడని గమన్ రెడ్డి తాతయ్య నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. గమన్ రెడ్డి రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో ఆదివారం జరిగిన పోటీలలో బంగారు పతకాన్ని సాధించినట్లు తెలిపారు. బ్లాక్ బెల్ట్ గ్రేడ్ లో ఉన్న గమన్ రెడ్డి ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 8 మెడల్స్ సాధించగా అందులో 5 బంగారు పతకాలు, 3 వెండి పతకాలు లభించాయన్నారు.

2025లో పంజాబ్, శ్రీలంక, అర్జెంటీనాలో జరగబోయే ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోనీ అల్కాపూర్ టౌన్ షిప్ లో స్కాలర్స్ అకాడమిలో 5వ తరగతి చదువుతున్న గమన్ రెడ్డి కోచ్ సైకం సుబ్బారావు శిక్షణలో ఎస్ఐటీఎస్ సంస్థలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపాడు. గమన్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల తల్లిదండ్రులు ఉదయ్ కుమార్ రెడ్డి శోభన, నాయినమ్మ కొణతం విజయలక్ష్మి, శిక్షణ పొందుతున్న సంస్థ నిర్వాహకులు, నేరేడుచర్ల ప్రముఖులు, బంధువులు అభినందనలు తెలిపారు.


Next Story