నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

by Bhanu |   (  Updated:2025-06-10 15:44:43  IST  )

నల్లగొండ జిల్లాలోని సాగర్ రోడ్డులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎస్ఎల్బీసీ చాకలి ఐలమ్మ విగ్రహం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మారుతి బ్రీజా కారు టైరు పేలి అదుపు తప్పింది.

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్
X

దిశ, నల్లగొండ: కారు టైరు పేలి బైకుపై వెళుతున్న వారిని ఢీకొట్టడంతో ఒకరి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండలోని ఎస్ఎల్బీసీ రోడ్ లోని ఐలమ్మ విగ్రహం దగ్గర మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ మండలం ముత్యాలమ్మ గూడెం గ్రామానికి చెందిన రుద్రాక్ష్మి తిలక్, వంశీ (22) బైక్ పై ఎస్ ఎల్ బీసీ వైపు వెళుతున్నారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వేణు అనే వ్యక్తి కారులో వెళుతున్నారు.

అయితే.. ఈ సమయంలో ఒక్కసారిగా కారు టైరు పగిలి, ముందు వెళుతున్న బైక్ పై దూసుకెళ్లి, పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వంశీ మృతి చెందాగా, తిలక్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘటనాస్థలికి వెళ్లి, క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడం వల్ల కారులో ఉన్న వ్యక్తులకు స్వల్లగాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Next Story