నల్లగొండ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు

by Ratna Kumari |

నల్గొండ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహుల్లో సందడి నెలకొన్నది.

నల్లగొండ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, నల్లగొండ కలెక్టరేట్ : నల్గొండ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహుల్లో సందడి నెలకొన్నది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అప్ గ్రేడ్ కావడంతో పాటు తొలి ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొంది కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లు ఉండగా.. జనరల్ 21, జనరల్ విమెన్ 13, బీసీ జనరల్ 8, బీసీ విమెన్ 8, ఎస్సీ జనరల్ 4, ఎస్సి ఉమెన్ 3, ఎస్టి జనరల్ కేటగిరికి 1 రిజర్వేషన్లు అమలయ్యాయి.

ఎస్సీ వార్డులు : 3, 4, 16

బీసీ వార్డులు : 1, 8, 18, 22, 23, 24, 26, 27, 28, 30, 35, 38, 39, 43, 44, 45

బీసీ మహిళ అవార్డులు : 28, 8, 18, 24, 35, 27, 26, 38

జనరల్ వార్డులు : 5, 6, 7, 10, 11, 13, 17, 19, 20, 21, 25, 29, 31, 32, 33, 34, 36, 37, 40, 41 ,42, 46, 47, 48 వార్డులు ఉన్నాయి.

కలెక్టర్, ఎన్నికల అధికారి, బి.చంద్రశేఖర్ శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని 6 మున్సిపాలిటీలు నల్గొండ నగరపాలక సంస్థ మహిళా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి ఓ ప్రకారం 2011 జనాభా ప్రాతిపదికన, బీ.సీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయింపులు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కలుపుకొని తక్కిన ఆరు మున్సిపాలిటీలలో 162 మున్సిపల్ వార్డులకు గాను నిబంధనల ప్రకారం 50 శాతం వార్డులను మహిళలకు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి ,చండూరు ఆర్టీవో శ్రీదేవి ,దేవరకొండ ఆర్టీవో రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కన్నారావు, టిఆర్ఎస్ బక్క పిచ్చయ్య, బిజెపి లింగస్వామి, సిపిఎం పార్టీ నర్సిరెడ్డి, టిడిపి పార్టీ వెంకటేశ్వర్లు, ఎంఐఎం పార్టీ రజియుద్దిన్, “ఆమె ఆద్మీ పార్టీ అన్సార్ పాల్గొన్నారు.


Next Story