- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతా తానే.. స్కానింగ్..అబార్షన్ లు.. ఇంట్లోనే లింగ నిర్ధారణ పరీక్షలు ..
కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నాయి.. కాసుల కక్కుర్తి పడి చేయకూడని పనులు చేస్తున్నారు..

దిశ, నకిరేకల్ టౌన్ : కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నాయి.. కాసుల కక్కుర్తి పడి చేయకూడని పనులు చేస్తున్నారు.. తమ కుటుంబంలో తనయుడు కావాలని కోరిక ఉన్న కుటుంబాల బలహీనతను ఆసరా చేసుకోని అందిన కాడికి దోచుకుంటూ.. అబార్షన్ చేస్తూ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. కడుపు లోనే ప్రాణాలు తీస్తున్నారు. కనపడని దేవుడు కన్నా.. కనిపించే డాక్టర్ మిన్న.. అన్న నినాదాలకు నిందలు పడుతున్నాయి.. వైద్యం పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ దందా నకిరేకల్ లో నే కాదు. అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం, వైద్యశాఖ అధికారులు ఇలాంటి ఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్పా.. పర్యవేక్షణ కరువైందని ఆరోపణలు ఉన్నాయి.. అనేక ప్రాంతాలలో ఆసుపత్రుల్లో, స్కానింగ్ సెంటర్లలో కనీస సౌకర్యాలు, అర్హతలేని డాక్టర్లు, టెక్నీషియన్ ఉన్నారని విమర్శలు ఉన్నాయి.. అయినా తనకేమీ పట్టణ విధంగా ఉందని అధికారులు ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలకు నకిరేకల్ మారింది. పట్టణానికి చెందిన ఓ ఆర్ఎంపీ, అతడి భార్య గతంలో ఓ ప్రైవేట్ దవాఖానలో కాంపౌండర్లుగా పని చేసేవారు. అదే సమయంలో గర్భవతిగా ఉన్న మహిళలు స్కానింగ్ వచ్చిన సమయంలో స్కానింగ్ ఊపిరి రాస్తూ ఆ మహిళలను స్కానింగ్ సెంటర్ లో తీసుకువెళ్తూ.. టెక్నీషియన్ ఎలా స్కానింగ్ చేస్తుందో పరిశీలిస్తూ కొంత అవగాహన పెంచుకుంటూ లింగ నిర్ధారణ ఎలా చేయాలో కొంత భార్యకు భర్త ట్రైనింగ్ ఇప్పించాడు . గతంలో ఆ ఆస్పత్రిలో భార్యాభర్తలు చేస్తున్న నిర్వాకం గమనించిన డాక్టర్ వారిని పోలీసులకు అప్పగించాడు. భార్యను తప్పించి భర్త తనపై నేరాన్ని వేసుకుని జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా బుద్ధి రాలేదు.. జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులు సైలెంట్ గా ఉండి నమ్మిస్తూ వచ్చాడు. ఎలాగైనా తాను ఎంచుకున్న వృత్తిని అందిన కాడికి తీసుకోవాలని ఉద్దేశంతో లింగ నిర్ధారణ పరీక్ష యంత్రాన్ని సొంతంగా కొనుగోలు చేసుకొని ఇంట్లోనే దుకాణం పెట్టాడు.
సుమారు పదిమందిని ఏజెంట్లను తయారు చేసుకొని వారికి డబ్బులు ఎరవేసి.. తమ తమ గ్రామాల నుండి గర్భిణులకు నిర్ధారణ పరీ క్షలు చేసుకునేందుకు తమ దగ్గరకు వచ్చేట్లు చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ అబార్షన్ చేయాల్సి వస్తే బాధితులు నుంచి రూ.30 వేల నుండి రూ.50వేలు మాట్లాడుకుని ఇతర ప్రాంతాలలో హాస్పటల్స్ డీల్ కుదుర్చుకొని ఆ హాస్పిటల్స్ కు పంపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల సూర్యా పేట జిల్లా మోతె మండలం రాఘవాపురానికి చెందిన గర్భిణి అనూష మృతితో ఈ ఆర్ఎంపీ బాగోతం బట్ట బయలైంది. ఈయనే కాదు ఇతర ప్రాంతాలలో అనేకమంది ఆర్ఎంపీలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.. బయ్య నగేశ్-అనూష దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఉన్నారు అనూష మరోసారి గర్భం దాల్చడంతో పుట్టబోయేది ఆడ బిడ్డ, మగ అని తెలుసుకోవాలనే ఆలోచన మెదిలింది.
బిడ్డ లింగనిర్థారణ కోసం సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన ఓ ఆర్ఎంపీని సంప్రదించారు. ఆయన నకిరేకల్ పట్టణంలోని సదరు ఆర్ఎంపీ దగ్గరికి తీసుకొచ్చి స్కానింగ్ చేయించాడు. కడుపులో ఉన్నది ఆడ బిడ్డ అని అతడు చెప్పడంతో అనూషకు అబార్షన్ చేయించాలని ఆమె బంధువులు సదరు నకిరేకల్ ఆర్ఎంపీకి చెప్పారు. దాంతో సూర్యాపేట లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు. అక్కడ అనూషకు అబార్షన్ చేసే ప్రయత్నంలో వైద్యం వికటించింది. దాంతో అనూషను హుటాహుటిన ఖమ్మం దవాఖానకు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 18న అనూష మృతి చెందింది. ఆమె మృతితో నకిరేకల్ లో స్కానింగ్ చేసిన ఆర్ఎంపీ పరారయ్యాడు. సూర్యాపేటలో కేసు నమోదు కాగా, నకిరేకల్ పోలీసులు కూడా సదరు ఆర్ఎంపీ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలకు నీళ్లు
1994. పి.సి.పి.యన్. డి.టి లింగ నిర్ధారణ నిషేధ చట్ట ప్రకారం, ఈ చట్టం ఆడ పిల్లల పట్ల వివక్షతను , ఆడ శిశువుల హత్యాను నిరోధించడానికి రూపొందించబడింది. కానీ అనేక సెంటర్లో. అమలు కావట్లేదనే విమర్శలు ఉన్నారు. కాసులకు ఆశపడి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ.. మహిళలు కడుపులోనే ఆడపిల్లలను ప్రపంచం చూడనివ్వడం లేదు. అయినా ప్రభుత్వం.. వైద్యాధికారులు చర్యలు తీసుకోవడంలో లోపాలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, వైద్యాధికారులు, ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే కాకుండా నిత్యం పర్యవేక్షణ ఉండాలని ప్రజలు కోరుతున్నారు..






