నాగం వ‌ర్షిత్ రెడ్డిని త‌క్ష‌ణ‌మే బీజేపీ జిల్లా అధ్య‌క్షుడి ప‌ద‌వీ నుంచి తొల‌గించాలి

by Nallavelli.Anjaneyulu |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పై

నాగం వ‌ర్షిత్ రెడ్డిని త‌క్ష‌ణ‌మే బీజేపీ జిల్లా అధ్య‌క్షుడి ప‌ద‌వీ నుంచి తొల‌గించాలి
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పై కుట్రపూరితంగా అగ్రకుల అహంకారంతో దాడి చేయించి మీడియా ప్రతినిధుల కెమెరాలు లాక్కొని ధ్వంసం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని బీజేపీ అధినాయకత్వం తక్షణమే జిల్లా అధ్యక్షుడు పదవీ నుంచి తొలగించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ యూత్ జేఏసీ చైర్మన్ కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ యువజన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామరాజుపై దాడి చేసిన వర్షిత్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్ కూడా కానీ మీరు రెండుసార్లు కౌన్సిలర్ గా, ఇద్దరు హేమాహేమీల మధ్య ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి నల్గొండ నియోజకవర్గంలో 28 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న రామరాజు చరిష్మాను చూసి బీసీ నాయకత్వాన్ని ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని అన్నారు.


బీసీలు తలుచుకుంటే మీరు రోడ్ల పైన తిరగగలుగుతారా అని అన్నారు. తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా జరుగుతున్నటువంటి గొడవను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల కెమెరాలను జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గుంజుకుని అందులో ఉన్నటువంటి మెమరీ కార్డును డిలీట్ చేయడం ఒక రౌడీ లాగా ప్రవర్తించడమేనన్నారు. అతని అహంకారం తగ్గాలంటే మీడియా సోదరులు నాగం వర్షిత్ రెడ్డి మీడియా సమావేశాలను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, నల్గొండ పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పాల్వాయి రవి, జిల్లేపల్లి సాయి, కొడదల శంకర్, కంబాలపల్లి అనీల్ కుమార్, మహమ్మద్ సలీమ్, బద్దం రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story