- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోదాడలో రాజకీయ వేడి పెంచిన మున్సిపల్ వార్డు రిజర్వేషన్లు
కోదాడ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలకు తెరలేపేలా వార్డు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శ

దిశ, కోదాడ: కోదాడ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలకు తెరలేపేలా వార్డు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ డ్రా ద్వారా 35 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో కోదాడ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల ఖరారుతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏ వార్డు ఎవరికి అనుకూలం? ఎక్కడ కొత్త ముఖాలకు అవకాశం? ఎక్కడ సీనియర్ నేతలకు దెబ్బ? అన్న అంశాలపై పార్టీల్లో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. పవర్ డ్రా ప్రక్రియ పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించామని జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన ఈ డ్రా కార్యక్రమం పూర్తయ్యాక వార్డు వారీగా రిజర్వేషన్లు వెల్లడించారు.
వార్డు వారీగా ఖరారైన రిజర్వేషన్లు ఇవే:
1 – జనరల్ ఉమెన్,
2 – ఎస్టీ జనరల్,
3 – ఎస్సీ జనరల్,
4 – ఎస్టీ ఉమెన్,
5 – జనరల్,
6 – ఎస్సీ ఉమెన్,
7 – జనరల్,
8 – బీసీ ఉమెన్,
9 – ఎస్సీ జనరల్,
10 – జనరల్,
11 – జనరల్ ఉమెన్,
12 – జనరల్ ఉమెన్,
13 – బీసీ ఉమెన్,
14 – బీసీ జనరల్,
15 – బీసీ జనరల్,
16 – బీసీ జనరల్,
17 – బీసీ జనరల్,
18 – జనరల్,
19 – జనరల్,
20 – జనరల్,
21 – బీసీ ఉమెన్,
22 – జనరల్,
23 – జనరల్ ఉమెన్,
24 – జనరల్,
25 – జనరల్ ఉమెన్,
26 – జనరల్ ఉమెన్,
27 – జనరల్,
28 – జనరల్ ఉమెన్,
29 – ఎస్సీ ఉమెన్,
30 – బీసీ ఉమెన్,
31 – జనరల్ ఉమెన్,
32 – బీసీ జనరల్,
33 – ఎస్సీ జనరల్,
34 – జనరల్ ఉమెన్,
35 – బీసీ ఉమెన్.
ఈ రిజర్వేషన్లతో కోదాడ మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఆశావహులు తమ తమ వార్డుల్లో ప్రచారానికి సిద్ధమవుతుండగా, పార్టీ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు ఎవరి రాజకీయ భవితవ్యాన్ని మార్చనున్నాయో అన్న చర్చలు కోదాడలో హాట్ టాపిక్‌గా మారాయి






