- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్గొండ మొదటి మేయర్ పీఠం మహిళకే..
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది.

మున్సిపల్ చైర్మన్లు, వార్డుల వారీగా శనివారం అధికారులు రిజర్వేషన్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అతివలకే పెద్దపీట దక్కింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉన్నాయి .అందులో నకరికల్ మున్సిపాలిటీకి తప్ప మిగతా 17 మున్సిపాలిటీలకు, నల్లగొండ కార్పొరేషన్ కు ప్రభుత్వం ఎన్నికల నిర్వహించనుంది. నల్లగొండ కార్పొరేషన్ మేయర్ పదవిని మహిళకు కేటాయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 360 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. అందులో జనరల్ స్థానాలు 182 , బీసీలకు 103, ఎస్సీ లకు 50, గిరిజనులకు 25 స్థానాలను కేటాయించారు.
మొదటి మేయర్ మహిళే....
సుదీర్ఘకాలంగా మున్సిపాలిటీగా కొనసాగుతున్న నల్లగొండ మున్సిపాలిటీ ప్రస్తుతం కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. అయితే మొదటి మేయర్ గా ఆ స్థానాన్ని అధిరోహించాలని నాయకులు ఆశపడ్డారు. అందులో ముఖ్యంగా అధికార పార్టీ మంత్రి అనుచరులు చెందిన ఒకరిద్దరు ఆ స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ రిజర్వేషన్ కేటాయింపులు భాగంగా జనరల్ మహిళగా కేటాయించారు. దీంతో ఆ నాయకులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ వారు పోటీ చేయాల్సిన స్థానాల్లో ఆ నేతలకు సంబంధించిన భార్యలను ఎన్నికల బరిలోకి దింపి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని పరోక్షంగా అధికారం దక్కించుకోవాలని ఆశపడుతున్నారు. వాళ్ళ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే.
3 నెలల తర్వాతే నకిరేకల్...
జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉంటే అందులో 18 కి మాత్రమే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుంది. అందులో భాగంగానే ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కౌన్సిలర్, చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లకి కేటాయించింది. నకిరేకల్ మున్సిపాలిటీ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ కావడం వల్ల ఆలస్యంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానివల్ల 2026 ఏప్రిల్ 30 నాటికి మున్సిపల్ కౌన్సిల్ కాల పరిమితి ముగుస్తుంది. ఆ తర్వాతే నకిరేకల్ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నకిరేకల్ తో పాటు ఇంకా నాలుగైదు మున్సిపాలిటీలకు అదే సమయంలో ఎన్నికలకు జరిగే అవకాశం ఉంది.
చైర్మన్‌ల రిజర్వేషన్లు ఇలా....
నల్గొండ మున్సిపాలిటీలో 18 మున్సిపాలిటీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి అందులో 17 మున్సిపల్ చైర్మన్ గా, ఒక మేయర్ ఎన్నిక జరుగనుంది. నల్లగొండ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేశారు.. మిగతా మున్సిపాలిటీలలో జనరల్ స్థానాలు గా నేరేడుచర్ల సూర్యాపేట తిరుమలగిరి హాలియా చండూరు, పోచంపల్లి రిజర్వేషన్లు ఖరారు చేశారు. జనరల్ మహిళలకు కోదాడ, మిర్యాలగూడ, చిట్యాల, చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట, బీసీ జనరల్ స్థానంగా హుజూర్నగర్, మున్సిపాలిటీ, బీసీ మహిళలకు దేవరకొండ, ఆలేరు స్థానాలు కాగా ఎస్సీ జనరల్ స్థానం నందికొండ, ఎస్సీ మహిళ కు మోత్కూరు స్థానాన్ని కేటాయించారు.






