మదర్ డెయిరీ చైర్మెన్ మధుసూదన్ రెడ్డి రాజీనామా..?

by Nallavelli.Anjaneyulu |

మదర్ డెయిరీ చైర్మెన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేశారు. మదర్ డెయిరీ నష్టాలలో ఉందని చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయాలని కొద్ది రోజులుగా డైరెక్టర్లు ఒత్తిడి చేయడంతో ఈ సస్పెన్స్ కు గురువారం తెరపడింది.

మదర్ డెయిరీ చైర్మెన్ మధుసూదన్ రెడ్డి రాజీనామా..?
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : మదర్ డెయిరీ చైర్మెన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేశారు. మదర్ డెయిరీ నష్టాలలో ఉందని చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయాలని కొద్ది రోజులుగా డైరెక్టర్లు ఒత్తిడి చేయడంతో ఈ సస్పెన్స్ కు గురువారం తెరపడింది. గురువారం సాయంత్రం మధుసూదన్ రెడ్డి రాజీనామా సమర్పించినట్టు తెలుస్తోంది. నూతన చైర్మన్ గా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన మందడి ప్రభాకర్ రెడ్డి ఎన్నిక కాబోతున్నట్లు స‌మాచారం. అయితే మధుసూదన్ రెడ్డి రాజీనామా ఆమోదం పొంది ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ మదర్ డెయిరీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నూతనంగా చైర్మన్ పదవీ స్వీకరించబోతున్న ప్రభాకర్ రెడ్డి రైతులకు పెండింగ్ లో ఉన్న బిల్లులు సుమారు 10 కోట్లు వెంటనే చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ పది కోట్లు వెంటనే పాడి రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

Next Story