- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టరేట్‌లో చెట్టు మీద ప్రేమ కథ.. చిన్న పిట్ట కేక.. తల్లి పిట్ట అభయం
పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న మాటను మరలా మనకు గుర్తుచేసే అరుదైన సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ గార్డెన్‌లో చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న మాటను మరలా మనకు గుర్తుచేసే అరుదైన సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ గార్డెన్‌లో చోటుచేసుకుంది. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఓ చెట్టుపై పిట్ట ఒకటి గూడు కట్టింది. అందులో చిన్న పిట్ట (బిడ్డ)కి జన్మనిచ్చింది. కలెక్టరేట్‌కి వచ్చే ప్రజలు ఆ గూడు అందంగా ఉందని ఫోటోలు తీసేందుకు చెట్టు కొమ్మను ఊపడం మొదలుపెట్టారు. భయంతో తల్లి పిట్ట అక్కడి నుంచి ఎగిరిపోయింది. తల్లి కనిపించక చిన్న పిట్ట కేకలు వేయడం మొదలుపెట్టింది.
ఇంతలో తల్లి పిట్ట తిరిగి వచ్చి గూడును చేరింది. తన బిడ్డ దగ్గరికి చేరి రెక్కలు చాపి, బిడ్డను తన రెక్కల కింద దాచుకుంది. ఈ మమతా ఘట్టాన్ని చూసినవారు కళ్లారా ఆ దృశ్యాన్ని తిలకించగా, కొందరు తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఈ సందర్భం సూర్యాపేట కలెక్టరేట్ గార్డెన్‌లో అందరినీ ఆవేశంలో ముంచెత్తించింది. దిశ కెమెరా కూడా ఆ అరుదైన క్షణాన్ని చిత్రీకరించింది.






