- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్తూర్బా పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.. అధికారులపై ఆగ్రహం
చండూరు కస్తూర్బా బాలికల పాఠశాల ను సోమవారం రాత్రి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.

దిశ,చండూరు : చండూరు కస్తూర్బా బాలికల పాఠశాల ను సోమవారం రాత్రి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల కోసం వండిన ఆహారాన్నిరుచి చూసి ఆహార నాణ్యత పరిశీలించారు. నాణ్యత సరిగా లేకపోవడం, విద్యార్థుల సంఖ్యకు.. వండిన ఆహారానికి పొంతన లేకపోవటంతో వండిన ఆహారం ఇంతమంది విద్యార్థులకు ఎలా సరిపోతుందంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిన కూడా వంటలలో నాణ్యత పెరగకపోవటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని వంటలల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
డార్మెటరీ హాల్స్ తరగతి గదులు, వంటగది పాఠశాల ను, చుట్టూ పరిసరాలను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ విద్యార్థులను అడుగగా వారు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలో వేడి నీటి సదుపాయం, పడుకోవడానికి బెడ్స్ పరుపులు, బ్లాంకెట్స్ , ఆట స్థలం బాత్రూమ్స్, టాయిలెట్స్ కల్పించాలని ఎమ్మెల్యే విద్యార్థినులు కోరారు.మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థినులు కోరిన అంశాలను కల్పిస్తానని హామీ హామీ ఇచ్చారు.విధుల్లో లేని పాఠశాల ఎస్ వో పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోరిమి ఓంకారం,నాయకులు కోడి శ్రీనివాసులు, దోటి వెంకన్న,కోడి గిరిబాబు, పల్లె వెంకన్న,గంట సత్యం, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






