ఆయుష్మాన్ పాలి క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

by velandi.Saikiran |

తిరుమలగిరి పట్టణంలో ప్రజల ఆరోగ్య రక్షణకు మరొక కొత్త ఆశాకిరణం వెలుగులోకి వచ్చింది. పట్టణ కేంద్రంలోని క్రాస్ రోడ్

ఆయుష్మాన్ పాలి క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే
X

దిశ తిరుమలగిరి: తిరుమలగిరి పట్టణంలో ప్రజల ఆరోగ్య రక్షణకు మరొక కొత్త ఆశాకిరణం వెలుగులోకి వచ్చింది. పట్టణ కేంద్రంలోని క్రాస్ రోడ్ చౌరస్తా వద్ద సూర్యాపేట రోడ్డులో ఆయుష్మాన్ పాలి క్లినిక్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. జనరల్,గైనిక్,ఆర్థోపెడిక్ విభాగాల్లో సమగ్ర వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో ఈ కేంద్రం ప్రారంభమైందని తెలిపారు.

ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే,డిఫెన్స్ రంగంలో వైద్యసేవలకు విశేష అనుభవం కలిగిన డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర లేదా పెద్ద స్థాయి చికిత్సల కోసం జనగాంలోని ప్రధాన ఆసుపత్రితో అనుసంధానం ఏర్పాటు చేశారు. దీని వలన చిన్నపాటి సమస్యల నుండి మేజర్ చికిత్సల వరకూ రోగులు సులభంగా సేవలు పొందగలరు.ఈ క్లినిక్ ప్రారంభంతో తిరుమలగిరి ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్యసేవలు లభించనున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తగ్గుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జైన రమేష్,ఆర్థోపెడిక్ అభిలాష్,గంటా రవీందర్, రాజేంద్రప్రసాద్,రాజేష్,బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story