కోమటిరెడ్డిది ఏ పార్టో ఆయనకే తెలవదు: ఎమ్మెల్యే సైదిరెడ్డి

by S Gopi |   (  Updated:2023-02-15 09:58:02  IST  )

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ పార్టో ఆయనకే తెలవదని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జై అంటూ... MLA Saidireddy Comments Over Komatireddy Comments

కోమటిరెడ్డిది ఏ పార్టో ఆయనకే తెలవదు: ఎమ్మెల్యే సైదిరెడ్డి
X

దిశ, నేరేడుచర్ల: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ పార్టో ఆయనకే తెలవదని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జై అంటూ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులతో కలిసి ఉంటారని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆరోపించారు. మంగళవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర వచ్చే ఎన్నికలలో హంగ్ ఏర్పడుతుందని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి స్పందించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో హంగు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగానే ఉందని అన్నారు. అన్న ఒక పార్టీ.. తమ్ముడు మరో పార్టీ అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొద్దున లేస్తే ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే తెలవదని.. ఇంతకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ పార్టీ ఎవ్వరికీ తెలియడం లేదని అన్నారు. వందకి వంద శాతం 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించటం ఖాయమని అన్నారు. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలంటూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుండి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయని అన్నారు.

Next Story