జైలుకైనా వెళ్తాగానీ అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదు

by Dishanational1 |
జైలుకైనా వెళ్తాగానీ అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదు
X

దిశ, నేరేడుచర్ల: రైతుల పండించిన పంటలను మిర్యాలగూడలోని రైసు మిల్లర్లు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారో అదేవిధంగా హుజూర్ నగర్ పట్టణంలోని రైస్ మిల్లర్లు రైతులు పండించిన ధాన్యంను అదేవిధంగా కొనుగోలు చేయాలని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రైతుల ధాన్యాన్ని రైస్ మిలర్లు మిర్యాలగూడలో విధంగా కాకుండా తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే వారి రైస్ మిల్లులను సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గడుప గడుపకు వివరించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, దానికి నిదర్శనం పార్లమెంట్ లో రాహుల్ గాంధీపై వేటు వేస్తే దానిపై స్పందించే పరిస్థితి లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం కోర్టులో కేసులు వేస్తున్నారని, జైలుకైనా వెళ్తాగానీ నియోజక వర్గంలో అభివృద్ధి ఆపే ప్రసక్తే లేదన్నారు.

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య మాట్లాడుతూ రైతుల కోసం అనేక సంక్షేమాలను తీసుకవచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. మనకు సాగర్ పక్కన ఉన్నా ఎప్పుడు నీళ్లు వస్తాయో అన్న ఆందోళనలో రైతులు ఉండే వారని... నేడు అలాంటి పరిస్థితి లేదని, పుష్కలంగా రెండు పంటలకు సాగు నీరు అందుతుందన్నారు. రైతులకు పంట పెట్టుబడికోసం ఎకరానికి రూ. 5 వేల సాయం అందిస్తూ ఆర్థికంగా భరోసా కల్పించారని అన్నారు. గతంలో పండిన పంటను అమ్ముకునేందుకు దళారులను ఆశ్రయించేవారని, నేడు ఐకేపీ, పీసీసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి వారి బ్యాంకు అకౌంట్లలో నగదును జమ చేస్తున్నారని అన్నారు. ఎరువుల కోసం గతంలో చెప్పులు పెట్టి క్యూ ఉండే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు.

అంతకముందు పట్టణంలోని కోదాడ రోడ్డులో కౌడిన్య బింక్షన్ హాల్ నుంచి మార్కెట్ యార్డు వరకు కళాకారుల బృందంతో, బాణా సంచా కాల్చుతూ ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమమ్మను, వైస్ చైర్మన్ గా ముడెం రామలింగారెడ్డిలతోపాటు డైరెక్టర్లను మార్కెట్ కమిటీ సెకండ్ గ్రేడ్ సెక్రటరీ సంగయ్య ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపల్, వైస్ చైర్మన్లు గెళ్లి అర్బన రవి, చందముళ్ల జయబాబు, జక్కుల నాగేశ్వరారవు, చల్లా శ్రీలతా రెడ్డి, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీలు గూడెవు శ్రీనివాస్, పెండెం సుజాత, ముడవత్ పార్వతీ, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, హుజూర్‌నగర్, మఠంపల్లి జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, జెడ్పీటీసీ జగన్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్లు దొండపాటి అప్పిరెడ్డి, రంగాచారి, ఆర్డీఓ వెంకారెడ్డితోపాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed