- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వినాయకుని నిమజ్జనం కోసం వచ్చి ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గల్లంతయిన తండ్రీ కొడుకులలో ఒకరి

దిశ, మిర్యాలగూడ (వేములపల్లి): వినాయకుని నిమజ్జనం కోసం వచ్చి ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గల్లంతయిన తండ్రీ కొడుకులలో ఒకరి మృతదేహం శనివారం లభ్యమయింది. పోలీసులు తెలిపిన వివరాలకు ప్రకారం మాడుగుల పల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన పున్నా సాంబయ్య(45) , ఆయన కుమారుడు శివమణి (20) వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద వినాయకుని నిమజ్జనం చేశారు.
అనంతరం సాంబయ్య స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకపోతుండగా తండ్రిని కాపాడే ప్రయత్నంలో భాగంగా శివమణితోపాటు ఇరువురు నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో నేరేడుచర్ల మండలం మేడారం సమీపంలో సాంబయ్య మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి, శివమణి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.






