- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిట్యాల మహిళలకు రైస్ మిల్లు మంజూరు చేయిస్తా : మంత్రి సీతక్క
చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళలకు రైస్ మిల్లును మంజూరు చేయించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.

దిశ, చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళలకు రైస్ మిల్లును మంజూరు చేయించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శనివారం చిట్యాల మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో ఎన్నికల ప్రచారంలో ఆమె స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు, 500 రూపాయలు గ్యాస్ రాయితీ, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, వడ్డీ లేని రుణాలు వంటి సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడంతో పాటు కోటి మంది మహిళలను లక్ష అధికారులుగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అలాగే చిట్యాల మున్సిపాలిటీ 15 కోట్ల నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారన్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 600 మహిళా సంఘాలకు రెండు, మూడు లక్షల రుణాలను మంజూరు చేసి వారు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఓటు వేసి గెలిపించినట్లయితే మున్సిపాలిటీ మరింత వేగంగా అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత ప్రభుత్వం చిట్యాల పట్టణ కేంద్రంలో 240 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి వాటిని పంపిణీ చేయకుండా వృధాగా వదిలేయడంతో ఎంతోమంది పేదలు సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్నారని, ఎన్నికల అనంతరం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు పంపిణీ చేయడమే కాకుండా సొంత ఇంటి జాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్, డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, కౌన్సిలర్ అభ్యర్థులు జిట్ట నగేష్, జడల పూలమ్మ, గాలి లింగమ్మ, కోనేటి ఎల్లయ్య, గుండెబోయిన శ్రీలక్ష్మి, జెర్రిపోతుల సత్యనారాయణ, దేశపాక లతా, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, సిలివేరు శేఖర్, బొబ్బలి సందీప, పందిరి గీత పాల్గొన్నారు.






