విద్యుత్ షాక్‌తో పాలు గేదె మృతి

by Nallavelli.Anjaneyulu |

మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన మేళ జానయ్యకు చెందిన పాలు గేదె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

విద్యుత్ షాక్‌తో పాలు గేదె మృతి
X

దిశ , మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన మేళ జానయ్యకు చెందిన పాలు గేదె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామాపురం గ్రామానికి చెందిన మేళా జానయ్య కి చెందిన పాలు గేదె మేతకు వెళ్తున్న సమయంలో గ్రామంలోని మసీదు సమీపంలో ఉన్న కరెంట్ పోల్‌కు అనుసంధానమైన ఎర్త్ వైర్‌కు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా రావడంతో గేదె ఆ వైర్‌ను తాకింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన పాలు గేదె విలువ మార్కెట్‌లో సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story