- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మర్రిగూడ నుంచి గ్రామసింహాల తరలింపు
మర్రిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం సర్పంచ్ వీరమళ్ళ శిరీష-లోకేష్ ఆధ్వర్యంలో గ్రామ సింహాలను గ్రామంలో లేకుండా పట్టివేసి వ్యాన్ లో నల్లమల్ల అడవులకు తరలించారు.

దిశ, మర్రిగూడ : మర్రిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం సర్పంచ్ వీరమళ్ళ శిరీష-లోకేష్ ఆధ్వర్యంలో గ్రామ సింహాలను గ్రామంలో లేకుండా పట్టివేసి వ్యాన్ లో నల్లమల్ల అడవులకు తరలించారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో వీధి కుక్కల బెడదతో ప్రతిరోజు మనుషులతో పాటు మూగజీవులు రోజుకు రెండు మూడు చొప్పున చనిపోతున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదుతో నూతన సర్పంచ్ వీధి కుక్కల తరలింపునకు కొంతమంది కుక్కలు పట్టే వారిని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి వాటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా వల వేసి పట్టి వ్యాన్ లో తరలించారు. గ్రామంలో గత రెండు రోజులుగా బాటసారులను, మేకలను, గొర్లను, కోళ్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో వాటిని తరలించారు. గ్రామ ప్రజలు స్థానిక సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ యూసుఫ్ తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






