- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేళ్లచెరువు మెడికల్ ఆఫీసర్ ప్రేమ్ సింగ్ మృతి
సుర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండల మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఠాకూర్ ప్రేమ్ సింగ్(40) గత కొంత కాలంగా క్యాన్సర్

దిశ, మేళ్లచెరువు /హుజూర్‌నగర్ రూరల్: సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండల మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఠాకూర్ ప్రేమ్ సింగ్(40) గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బధపడుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతిచెందారు. డాక్టర్‌గా ఆయన 2008లో హుజూర్‌నగర్ ఆసుపత్రిలో మొదటిసారి డాక్టర్‌గా నియమితులై పని చేశారు. ఆ తర్వాత మేళ్లచెరువు మండల మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. హుజూర్‌నగర్ ప్రాంతంలో పనిచేస్తున్నందున ఈ ప్రాంతం అనుకులంగా ఉంటుందని హుజూర్‌నగర్‌లోనె సొంత ఇంటిని ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు.
డాక్టర్ ప్రేమ్ సింగ్‌కి భార్య దివ్య, సంతానం లేరు. ఆయన అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన మిర్యాలగూడలో నిర్వహిస్తున్నారు. హుజూర్‌నగర్ మేళ్లచెరువు మండలాలలో వైద్యాధికారిగా పనిచేయడం వలన చాలా మందికి ఆయన సుపరిచితుడు. ఆయన మరణ వార్త విని ప్రజాప్రతినిధులు, అధికారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.






