- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో అసమానతలకు కారణం మనుస్మృతే : సామాజిక ప్రజా సంఘాల నేతలు
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత దేశంలో సామాజిక అసమానతలను

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత దేశంలో సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షతలకు కారణమైనది మనుధర్మ శాస్త్రమేనని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, టీపీవైఎస్ జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం, ఆశాస్త్రీయమైన మనుస్మృతిపై మండిపడ్డారు. గురువారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంబద్ధమైన, అనాగరికమైన ఆలోచనల ద్వారా వేయల సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించింది మనుస్మృతేనని వారన్నారు. చదువు, భూమి ఆభరణాలు, ఆయుధాలు, అధికారాలు అన్ని కొద్దీ మంది చేతుల్లో ఉంచుతుంది మనుస్మృతే అన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశానికి ప్రమాదం
గోవాల్కర్ నుంచి నేటి మోహన్ భగవత్ దాకా ,శ్యాంప్రసాద్ ముఖర్జీ నుండి నేటి మోడి వరకు ఎవరు, ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మన ధర్మం అంటూ మాట్లాడుతున్నారన్నారు. మన ధర్మం అంటే మనుధర్మమే అనడమంటే ఇంతకంటే అనాగరికమైన చర్య మరొకటి ఉండదన్నారు. రాజ్యాంగ రక్షణ ద్వారా దేశాన్ని కులం మతం ప్రాంతం బాషా లింగ బేధం లేకుండా ఐక్యంగా ఉంచగలమన్నారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఇందూరి సాగర్, గోలి సైదులు, కొండ వెంకన్న, అద్దంకి రవీందర్, తెలగమల యాదగిరి, గాదే నరసింహ్మ, బొల్లు రవీందర్, అవుట రవీందర్, సత్తయ్య, మల్లం మహేష్, కోట సైదులు, నలుపరాజు సైదులు, మురళి, సిహెచ్. తిరుపతయ్య, గోలి మల్లేష్ పాల్గొన్నారు.






