- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12న పీసీసీ అధ్యక్షులు, మంత్రులు,ఎమ్మెల్యేలు రాక
ఈ నెల 12 న అమరవీరుల స్మారక ఆవిష్కరణ ను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎమ్మెల్సీ శంకర్

దిశ, శాలిగౌరారం : ఈ నెల 12 న అమరవీరుల స్మారక ఆవిష్కరణ ను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో 1948 లో పదిమంది విద్యార్థులు జాతీయ జెండాను పాఠశాలలో ఎగరవేసినందుకు రజాకార్ల చేతిలో హతమైన అమరవీరుల స్మారకార్థం మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు చేతుల మీదుగా స్థూపాన్ని నిర్మించారు. అయితే.. ఆ స్థూపాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్,మంత్రులు వెంకట్ రెడ్డి,ఉత్తమ కుమార్ రెడ్డి,జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్,ఎమ్మెల్యేలు ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రజలు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్,పాదురి శంకర్ రెడ్డి నరిగే నరసింహ,సింగిల్ విండో చైర్మన్ తాళ్లూరి మురళి,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సమరం రెడ్డి,మాజీ సర్పంచ్ ఎస్.కె ఇంతియాజ్,దండ అశోక్ రెడ్డి,భూపతి వెంకన్న,మాజీ ఎంపీటీసీ కవిత రామలింగయ్య,నోముల జనార్ధన్,భూపతి అంజయ్య,వేముల గోపినాథ్, బొల్లికొండ గణేష్,సుల్తాన్ ఎల్లయ్య,గుండ్లపల్లి సైదులు,కట్టగూరి సురేందర్ రెడ్డి,కడారి అంజయ్య,శానాల యుగంధర్ రెడ్డి,కోక సాయి,నల్లగొండ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.






