ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి.

by Bhanu |

ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి.
X

దిశ, అనంతగిరి: ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల, స్థానికులు వివరాల ప్రకారం వాయిల సింగారం గ్రామానికి చెందిన దేవులపల్లి రామ్మూర్తి (45)అను వ్యక్తి తప్పిపోయిన తమ గేదెలను వెతుక్కుంటూ శుక్రవారం ఉదయం సమయంలో గ్రామంలోని ఉర చెరువు వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి వరకు అన్నిచోట్ల వెతికారు. ఏక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం గ్రామంలోని కొంతమంది చెరువు వద్దకు వెళ్ళిన యువకులు నీటిలో మృతదేహం తెలియాడుతూ ఉండడం గమనించి గ్రామంలోని పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు నీటిలో ఉన్నటువంటి మృతదేహం రామ్మూర్తిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

Next Story