చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి

by Bhanu |   (  Updated:2025-05-15 14:31:40  IST  )

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పగిడిమర్రి గ్రామంలో చోటుచేసుకుంది.

చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ, కనగల్లు: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పగిడిమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. తహసిల్దార్ పద్మ తెలిపిన వివరాల ప్రకారం పగిడిమర్రి గ్రామానికి చెందిన అబ్బిడి నాగార్జున రెడ్డి (35) వ్యవసాయం చేసుకుంటూ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం గ్రామ సమీపంలోని గౌండ్ల కుంటలో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశత్తు కరెంటు షాక్ కొట్టడంతో కుంటలో పడిపోయాడు. స్థానికులు గమనించి కుంటలో గల్లంతయిన నాగార్జున రెడ్డిని వెతికి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడికి భార్య,కూతురు,కుమారుడు ఉన్నారు.


Next Story