- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గేదెను ఢీ కొట్టిన బైక్.... అక్కడికక్కడే వ్యక్తి మృతి ...
by Bhanu |
గేదెను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందిన సంఘటన అనంతగిరి మండల పరిధిలోని బొజ్జగూడెం తండా గ్రామ శివారులో ఖమ్మం కోదాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

X
దిశ, అనంతగిరి : గేదెను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందిన సంఘటన అనంతగిరి మండల పరిధిలోని బొజ్జగూడెం తండా గ్రామ శివారులో ఖమ్మం కోదాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికుల, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కట్టు కాసారం గ్రామానికి చెందిన బోయపాటి వీరబాబు(50) కోదాడ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. కట్టు కాసారం గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జరిగిన డిపార్ట్మెంట్ మీటింగ్లో హాజరై
తిరిగి కోదాడ పట్టణంలోని తన ఇంటికి వస్తున్న క్రమంలో బొజ్జగూడెం తండా గ్రామ శివారులో జాతీయ రహదారిపై గేదె ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా రావడంతో బైక్ గేదెను ఢీకొట్టింది. తీవ్రమైన గాయాలతో వీరబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






