విద్యుత్ ప్రమాదంతో వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): విద్యుత్ ప్రమాదంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని ఎల్లపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పాలకవీడు ఎస్సై కో

విద్యుత్ ప్రమాదంతో వ్యక్తి మృతి
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): విద్యుత్ ప్రమాదంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని ఎల్లపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పాలకవీడు ఎస్సై కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.ఎల్లాపురం గ్రామానికి చెందిన పెండెం సైదులు(40) అనే రైతు పొలం గట్టుపై ఉన్న గడ్డితోపాటు చెట్లను కొడవలితో కోస్తుండగా ఆ చెట్ల మధ్యలో కనిపించకుండా నేలపై పడి ఉన్న విద్యుత్ వైరును కూడా కొడవలితో కోయడంతో ఆ కొడవలికి విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సైదులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కొడుకులు అఖిల్ నిఖిల్ ఉన్నారు. భార్య సుజాత ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటేష్ తెలిపారు.

Next Story