- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ మోత్కూర్ పట్టణ అధ్యక్షుని ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ మోత్కూరు పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్ ఇంటి ఎదుట బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, మోత్కూరు : కాంగ్రెస్ మోత్కూరు పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్ ఇంటి ఎదుట బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మోత్కూరు మండలం ముశిపట్ల శివానగర్ కు చెందిన కోమటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2022లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్ కు రూ.15 లక్షలు అప్పుగా ఇచ్చాడు. 2023లో రామచంద్ర రూ.10 లక్షలు ప్రభాకర్ రెడ్డికి తిరిగి ఇచ్చి మరో రూ. 5 లక్షలు 6 నెలలకు ఇస్తానని అప్పు కాగితం రాసి ఇవ్వడం జరిగింది.
రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదని.. రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నాడని బాధితుడు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను ఇతరులకు డబ్బులు ఇచ్చేది ఉందని వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని, తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని, ఎంతగా బ్రతిమాలి అడిగినా పట్టించుకోవడం లేదని, తనకు గత్యంతరం లేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితి చేయి దాటిపోకుండా పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయమై రామచంద్ర గౌడ్ ను వివరణ కోసం సంప్రదిస్తే.. స్పందించకపోవడం గమనార్హం.






