- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ సీపీఎం కార్యాలయానికి మల్లు స్వరాజ్యం పార్థీవ దేహం
by Sathputhe Rajesh |
దిశ, నల్లగొండ: మల్లు స్వరాజ్యం పార్థీవ దేహం సీపీఎం నల్లగొండ కార్యాలయానికి చేరుకుంది.

X
దిశ, నల్లగొండ: మల్లు స్వరాజ్యం పార్థీవ దేహం సీపీఎం నల్లగొండ కార్యాలయానికి చేరుకుంది. మర్రిగూడ చౌరస్తా నుంచి ఆ పార్టీ నాయకులు ర్యాలీగా తీసుకొచ్చారు. కమ్యూనిస్ట్ నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరేశం పాల్గొని మల్లు స్వరాజ్యం భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కాగా, సీపీఎం కార్యాలయానికి ఉదయం నుంచే వందల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. స్వరాజ్యం భౌతికకాయం వద్ద నివాళులర్పించడానికి కార్యకర్తలు పోటీపడుతుండటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం గడియారం చౌరస్తాలో స్థానికుల సందర్శనార్థం కాసేపు మల్లు పార్థీవ దేహం ఉంచనున్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరై నివాళులర్పించనున్నారు.
Next Story






