- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీనీ ఢీకొట్టిన డీసీఎం..
by Ramesh Naini |
నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి, అద్దంకి బైపాస్ రోడ్డుపై ఆదివారం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి, అద్దంకి బైపాస్ రోడ్డుపై ఆదివారం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న డీసీఎం ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో డీసీఎం క్యాబిన్ పూర్తిగా దెబ్బతిని, డ్రైవర్ లోపల చిక్కుకుపోయాడు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే తాడు సాయంతో డ్రైవర్‌ను బయటకు తీశారు. అక్కడే ప్రథమ చికిత్స అందించి, అనంతరం అంబులెన్స్‌లో నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో ఇదే..
Next Story






